neevu naa venta lenicho. నీవు నా వెంట లేనిచో

ప. నీవు నా వెంట లేనిచో యేసయ్య
     నా జీవితానికి అర్దమే లేదయ్య ॥2॥
 
      ధరణి యందునా పరమందునా  ॥2॥

      నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య ॥2॥

అ. ప.  నా ప్రాణం ఉన్నంత వరకు
           నా ఊపిరి ఆగే వరకు     ॥2॥
           నీవే నా ఆలాపన యేసయ్య
           నీకే నా ఆరాధన ॥2॥
చ:    కారు చీకటి పట్టగా
       నా మనసులో కటిక చీకటి పుట్టగా
        అదుకొనువారు లెరెవ్వరు
         ఇలలో  ఎటు చూచినా  ॥2॥

        అందరు  నను విడచినా
        నీవు నన్ను విడువలేదు  ॥2॥
     
       కీడు రానియ్యకా  నీ దివ్యకరములచె                                          నన్నాదుకున్నావయ్యా ॥2॥     ॥ నా ప్రాణం॥

చ:   అలసిపొయినా వేళలో
       అధైర్యమే ఎదురైన వేళలో
       ఆశలే  ఆవిరైన వేళలో
       ఆపధలెన్నో ఆవరించినా ॥2॥
    
       అందరు  నను విడచినా
        నీవు నన్ను విడువలేదు  ॥2॥

       అనందతైలముతో  అక్షయ పాత్రవై
       నా తోడు నిలిచావయ్య...॥2॥          ॥నా ప్రాణం॥✝︎

Comments

Popular posts from this blog

Stithi Maaralantey stuthi cheyaali telugu christian song lyrics. స్తితి మారాలంటే స్తుతి చేయాలి

nuvvantey naakentho ishtam yesayya

lechi velledham telugu lyrics , లేచి వెళ్లెదం పాట లిరిక్స్